Nishad Yusuf:సినిమాకు ఉత్తమ ఎడిటర్. నిషాత్ యూసఫ్. అనుమానాస్పద మృతి చెందారు.

editor of kanguva

తమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన ‘కంగువ’ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారు. 43 ఏళ్ల నిషాద్, కొచ్చిలోని పనంపిల్లి నగరంలో తన నివాసంలో ఈ తెల్లవారుజామున విగతజీవిగా కనిపించారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆయన మరణానికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

మలయాళం మరియు తమిళ చిత్ర పరిశ్రమలో పాప్యులర్ ఎడిటర్‌గా పేరు సంపాదించుకున్న నిషాద్ యూసుఫ్ కు భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణం అనేక నటులు, దర్శకులు మరియు మిత్రులకు ఆవేదన కలిగించింది. కేరళ ప్రభుత్వం తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ‘ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ డైరెక్టర్స్ యూనియన్’ ద్వారా సంతాపం తెలిపింది 2022లో విడుదలైన ‘తల్లుమాల’ చిత్రానికి గాను నిషాద్ ఉత్తమ ఎడిటర్‌గా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికీ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న ‘బాజూకా’ సినిమాలో కూడా పనిచేస్తున్నారు అయితే, నిషాద్ ఎడిటర్‌గా పనిచేసిన ‘కంగువ’ సినిమా వచ్చే నెల 14న విడుదల కానుంది, ఇది నిషాద్ చివరి చిత్రంగా భావించబడుతోంది. ఆయన అనుకోని మరణంతో సినిమా పరిశ్రమలోని అనేక మంది ఆవేదనతో నిండి ఉన్నారు, ఇది వారి ప్రాజెక్టులపై నెగెటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Guаrdіоlа’ѕ futurе іn fresh dоubt wіth begiristain set tо lеаvе manchester city. Taiwan’s scenic tourist destination faces earthquake risks from active faults. Latest sport news.