హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు కనిపించకుండా చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల పై కేటీఆర్ స్పందించారు. చిట్టినాయుడు.. నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. చిట్టినాయుడు.. నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని చెప్పారు. నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడని పేర్కొన్నారు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడని గుర్తు చేశారు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడన్నారు. సాధించుకున్న తెలంగాణను నువ్వు సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోసాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.