mahesh babu 1

Mahesh Babu: యంగ్ హీరో సినిమాలో కృష్ణుడిగా మహేష్ బాబు.. క్లారిటీ ఇదిగో;

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ కోసం రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవలే మహేష్ బాబు “గుంటూరు కారం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది, ఫలితంగా అభిమానులను నిరాశపరిచింది ఇప్పుడిక, మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌పై అభిమానుల ఆశలు మరింత పెరిగాయి. పాన్ వరల్డ్ మూవీగా రూపొందనున్న ఈ సినిమా ఆఫ్రికన్ అడవులను నేపథ్యంగా తీసుకుని తెరకెక్కనుంది. ఇప్పటికే రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించి కెన్యాలో చిత్రీకరణ స్థలాలను పరిశీలిస్తున్నారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు పూర్తి విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఇప్పటికే సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ పొందిన మహేష్, ఈ సినిమాలో మరింత పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారని సమాచారం అయితే, ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఇది జరుగుతున్నంత వరకు, మహేష్ బాబు మరో సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి అతని మేనల్లుడు గల్లా అశోక్ నటిస్తున్న “దేవకీ నందన వాసుదేవ” అనే సినిమాలో మహేష్ బాబు కృష్ణుడి పాత్ర లో కనిపిస్తారని ప్రచారం సాగింది ఈ వార్తలు మహేష్ అభిమానులను ఉత్సాహపరిచాయి, ఎందుకంటే వారు మహేష్ బాబును కృష్ణుడిగా చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే, ఈ వార్తలపై గల్లా అశోక్ ఇటీవల క్లారిటీ ఇస్తూ, మహేష్ బాబు ఆ చిత్రంలో నటించడం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menyikapi persoalan rempang, bp batam ajak masyarakat agar tetap tenang. But іѕ іt juѕt an асt ?. Swiftsportx | to help you to predict better.