Minister Nara Lokesh meeting with Sales Force CEO Clara Shih

సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షిహ్‌తో మంత్రి నారా లోకేశ్‌ సమావేశం

అమరావతి: ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన లాస్ వెగాస్‌లో జరిగిన సినర్జీ సమ్మిట్‌లో సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో, లోకేశ్ స్మార్ట్ గవర్నెన్స్ మరియు ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందించడంతో పాటు, ఏఐ ఆధారిత పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. సేల్స్‌ఫోర్స్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రయోగాత్మక శిక్షణ కోసం విద్యా సంస్థలతో భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు, స్థానిక స్టార్టప్‌లకు ఏఐ టూల్స్ మరియు మెంటార్‌షిప్ అందించాలనే కోరారు. ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం)ని మెరుగుపరచడానికి సేల్స్‌ఫోర్స్ ఐన్‌స్టీన్ ఏఐను పరిచయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాలనా రంగంలో సామర్థ్యాన్ని పెంచడానికి ఏఐ-పవర్డ్ ఆటోమేషన్ మరియు అనలిటిక్స్‌పై మద్దతు అందించాలనుకుంటున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించాలనే సూచించారు.

ఈ సందర్భంగా, క్లారా షిహ్ సేల్స్ ఫోర్స్ ఏఐ వ్యూహాలు, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో నూతన ఆవిష్కరణలు మరియు సేవలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మరియు వ్యాపార విధుల్లో ఆటోమేషన్‌ కోసం ఏఐ టూల్స్ అందిస్తున్నట్లు తెలిపారు. సేల్స్‌ఫోర్స్ ఏఐ సంస్థ కృత్రిమ మేధ పై నైతికతతో కూడిన దృష్టి సారించిందని, ప్రభుత్వరంగ ప్రాజెక్టులలో బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి కట్టుబడి ఉన్నామని క్లారా పేర్కొన్నారు. ప్రస్తుతం, తమ సంస్థ 287 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ బృందంతో చర్చలు జరుపుతామని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. But іѕ іt juѕt an асt ?. Latest sport news.