ఇంటర్నెట్ డెస్క్: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన “క” అనే సినిమా, ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రానికి సుజిత్ మరియు సందీప్ దర్శకత్వం వహించారు సినిమా విడుదలకు ముందుగా హైదరాబాదులో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై సినిమా గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో, కిరణ్ అబ్బవరం భావోద్వేగంగా మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు, సినిమా ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆయన స్పష్టంగా వెల్లడించారు కిరణ్ మాట్లాడుతూ, “నా అమ్మ కూలీ పని చేసి మమ్మల్ని చదివించింది ఆమె మా కోసం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించేందుకు విదేశాలకు వెళ్లిపోయింది నన్ను ఇంగ్లిష్ మీడియంలో చదివించింది నా జీవితంలో అత్యంత అవసరమైన సమయాల్లో మా అమ్మతో గడపలేకపోయాను మా అమ్మ చేసిన త్యాగాలన్నీ గుర్తించి, నా జీవితంలో ఎక్కువ కష్టపడాలని నిర్ణయించుకున్నాను. అందుకే, నా ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు వచ్చాను నా సినీ ప్రయాణం షార్ట్ ఫిల్మ్‌లతో ప్రారంభమైంది నేను ఎవరినీ నేరుగా అవకాశాలు అడగలేదు. ‘రాజా వారు రాణి గారు’ తో మొదలైన నా ప్రస్థానం తర్వాత ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ ద్వారా మరింత ముందుకు సాగింది.
అయితే, ఈ ప్రయాణంలో ఆయనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాపై చాలా ట్రోల్స్ వచ్చాయి నా గురించి అనేక అబద్దాలు ప్రచారం చేశారు. కొన్ని రాజకీయం సంబంధిత వ్యాఖ్యలు చేశారు. నిజానికి, నేను ఒక సాధారణ కూలీ కుటుంబం నుంచి వచ్చాను తెరపై నాకు అలసటతో కనిపించవచ్చు, కానీ అందుకు కారణం నేను అందంగా లేకపోవడం కాదు, నిద్ర లేకుండా కష్టపడటం నాకు ఈ ట్రోల్స్ ఎలాంటి నష్టం చేశాయో చెప్పడం కష్టం. దయచేసి ఎవరినైనా ట్రోల్ చేయడానికి ముందు వారి వెనుక ఉన్న కష్టాన్ని గుర్తించండి. అని కిరణ్ తెలిపారు తనకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని, ‘క’ చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమా నా అభిమానుల కోసం ఈ సినిమా మీకు నచ్చకపోతే, నేనే సినిమాలు చేయడం మానేస్తా. కానీ, ఇది మీ అందరూ గర్వపడే సినిమా అవుతుంది. అని భావోద్వేగంగా చెప్పారు.
ఈ సందర్భంగా, నాగ చైతన్య మాట్లాడుతూ, కిరణ్ అబ్బవరం అంటే నాకు చాలా ఇష్టం. అతడిలోని అంకితభావం, కష్టపడి ఎదిగిన నటుడు అనే విషయం నాకు స్పష్టంగా తెలిసింది. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్‌తో వచ్చాను, కానీ కిరణ్ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇక్కడికొచ్చి తన ప్రతిభతో నిలదొక్కుకున్నాడు. ‘క’ వంటి సినిమాలు సినీ నేపథ్యం లేని వారికి జీవితంలో మార్గం చూపుతాయి. ట్రోల్ చేసేవారిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి విజయానికి వెనుక ఒక మహిళ ఉంటుంది. కిరణ్ విజయానికి కూడా అతడి అమ్మ, భార్యల ప్రోత్సాహం ఉందని నేను భావిస్తున్నాను.