cm revanth reddy 1

Revanth Reddy;దీపావళి పండుగను విదేశీ మద్యంతో జరుపుకుంటున్నారా? అని ప్రశ్న

జన్వాడ ఫాంహౌస్ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి దీపావళి పండుగలో చిచ్చుబుడ్లు కాల్చే సంప్రదాయం ఉంటే, ఫాంహౌస్‌లో మాత్రం సారాబుడ్లు (మద్యం) వెలుగులోకి వచ్చాయని ఎద్దేవా చేశారు కేటీఆర్ విదేశీ మద్యంతో దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారా? అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఫాంహౌస్ ఘటనపై బీఆర్ఎస్ నేతల కట్టుకథలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు అలాగే, తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మీడియా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు సమయం వచ్చినప్పుడు తాను మూసీ నదీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపడతానని, అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు నడుస్తానని తెలిపారు ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ నేతలు కూడా రావాలని విసురుగా సవాలు విసిరారు. అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా అవాస్తవాల ప్రచారం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

రియల్ ఎస్టేట్ రంగం పై కూడా రేవంత్ రెడ్డి స్పందిస్తూ, హైదరాబాద్ కారణంగా ఈ రంగం పడిపోలేదని, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం నిశ్చలంగా ఉందని అన్నారు సినిమాలలో రాజమౌళి, రాంగోపాల్ వర్మలకు వేర్వేరు స్టైల్ ఉన్నట్లు, రాజకీయాల్లోనూ తన స్టైల్, కేటీఆర్ స్టైల్ వేర్వేరుగా ఉన్నాయని అన్నారు తనకు చిన్న వయస్సు, ఇంకా రాజకీయంగా విస్తారమైన భవిష్యత్తు ఉందని, ప్రజలను అణచివేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు ప్రజాస్వామ్య బాటలోనే ముందుకు సాగతానని స్పష్టం చేశారు ఇక కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ, ఆయన పని అయిపోయిందని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రూ. 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినట్లు రేవంత్ విమర్శించారు టీజీపీఎస్సీ నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 90% రిజర్వేషన్లు కేటాయించడంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Lankan t20 league.