vaa 1

NXP AIM 2024లో అత్యుత్తమ స్థానం పొందిన కెఎల్‌హెచ్ అజీజ్ నగర్ కు చెందిన “బ్రెయినీ బాట్స్”

హైదరాబాద్‌: తమ బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులతో కూడిన “బ్రెయినీ బాట్స్” టీమ్‌ NXP AIM 2024 పోటీలో ఆకట్టుకునే రీతిలో 4వ స్థానాన్ని పొందినట్లు కెఎల్‌హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్ వెల్లడించింది. ఈ పోటీలో “బ్రెయినీ బాట్స్” టీమ్‌ ప్రతిష్టాత్మక ఏఐ అర్జున అవార్డును మరియు రూ. 10,000 నగదు బహుమతిని అందుకుంది. ఆవిష్కరణ మరియు సమస్య పరిష్కారంలో వారి నైపుణ్యాలను ఈ అవార్డు ప్రదర్శిస్తుంది.

AIM NXP 2024 ఛాలెంజ్, ఒక ప్రముఖ జాతీయ పోటీ. ఏఐ, మొబిలిటీ మరియు రోబోటిక్స్‌తో కూడిన ప్రాజెక్ట్ ఆధారిత సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులను ఆహ్వానిస్తుంది. భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల నుండి 620 కంటే ఎక్కువ జట్లతో పోటీ పడిన “బ్రెయినీ బాట్స్” బృందం అసాధారణమైన సాంకేతిక చతురతను ప్రదర్శించింది. లక్ష్మి, నౌషీన్ మరియు మేఘనతో కూడిన “బ్రెయినీ బాట్స్” బృందంకు అధ్యాపకులు మద్దతునిచ్చారు మరియు ఉబుంటులో గెజిబో సిమ్యులేటర్‌ను వీరు ఉపయోగించారు, అధునాతన నావిగేషన్ కోసం LiDAR మరియు కెమెరా సాంకేతికతను అనుసంధానించారు.

సవాళ్లు మరియు తీవ్రమైన డీబగ్గింగ్ సెషన్‌లను అధిగమిస్తూ ఈ టీమ్ సిమ్యులేషన్ ఫేజ్ అధిగమించింది మరియు బిట్స్ పిలానీ హైదరాబాద్‌లో ప్రాంతీయ ఫైనల్స్‌కు చేరుకుంది. వారి స్థిరమైన ప్రదర్శన వారిని నోయిడాలో గ్రాండ్ ఫినాలేకి ఎంపికయ్యేలా చేసింది, అక్కడ వారు తమ బగ్గీని మరింత మెరుగుపరిచి అగ్ర పోటీదారులలో 4వ స్థానాన్ని పొందారు. NXP యొక్క విపి , శ్రీ హితేష్ గార్గ్ హాజరైన అవార్డుల వేడుకతో పోటీ ముగిసింది.

కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. జి. పార్ధ సారధి వర్మ, టీమ్ సాధించిన విజయాల పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “మా ఇసిఇ బృందం యొక్క అత్యుత్తమ ప్రదర్శన మా సంస్థకు గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన విలువలైన ఆవిష్కరణ, స్థిరత్వం మరియు శ్రేష్ఠత పట్ల అచంచలమైన నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుంది దేశంలోని అగ్రశ్రేణి సంస్థల విద్యార్థులతో పోటీపడి సాధించిన వారి విజయం మా విద్యార్థుల సామర్థ్యానికి మరియు అంకితభావానికి నిదర్శనం..” అని అన్నారు.

కెఎల్‌హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్ ప్రాక్టికల్ అభ్యాసం మరియు ఆవిష్కరణకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. రామకృష్ణ మార్గదర్శకత్వంలో విద్యార్థులకు వాస్తవ ప్రపంచ సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అధ్యాపకులు మరియు సిబ్బందితో పాటు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగాధిపతి డాక్టర్. ఎం. గౌతమ్ లు విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్ మరియు ఐఓటి వంటి ఉప విభాగాలలో జ్ఞానాన్ని పెంపొందించడానికి అంకితమయ్యారు. హ్యాండ్-ఆన్ స్కిల్ డెవలప్‌మెంట్‌ను డిపార్ట్‌మెంట్ నొక్కి చెబుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు సిస్టమ్‌ల రూపకల్పన మరియు తయారీ కోసం అత్యాధునిక సిమ్యులేషన్ టూల్స్ మరియు అల్గారిథమ్‌లను ఉపయోగించి, విభిన్న పారిశ్రామిక మరియు వాస్తవ-ప్రపంచ వినియోగాలలో అత్యుత్తమ నైపుణ్యం కోసం గ్రాడ్యుయేట్‌లను సిద్ధం చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. Sikkerhed for både dig og dine heste. Gutfeld : biden is failing because he simply hasn't produced for anyone facefam.