rashi khanna

రాశిఖన్నా;సోషల్ మీడియాలో చాలా మంది ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు?

రాశి ఖన్నా స్టార్ హీరోయిన్‌ కావాలనుకుని టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అందాల నటి, తన ప్రయాణంలో ఆశించిన స్థాయికి చేరుకోకపోయినా, క్రమంగా ఉన్న అవకాశాలతో సర్దుకుపోతోంది. 2014లో “ఊహలు గుసగుసలాడే” సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా, ఆ తర్వాత పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రాశి ఖన్నా నటించిన సినిమాలు అతి పెద్ద విజయాలు సాధించలేకపోయినప్పటికీ, సాధారణంగా యావరేజ్ స్థాయిలో వసూళ్లు సాధిస్తాయని చెప్పవచ్చు ఆమె నటనపై పలువురు ప్రశంసలు కురిపించినప్పటికీ, బడా హీరోలతో కలిసి నటించే అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు. ఈ విషయంపై పరిశీలన చేస్తే రాశి నటనలో పౌరుషం, మెచ్యూరిటీ లేదని, పిల్లల నటనలా ఉంటుందని పలువురు విమర్శలు చేశారు. అయినప్పటికీ, ఆమె తన నటనను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ (తమిళ) మరియు బాలీవుడ్ (హిందీ) చిత్రాల్లో కూడా రాశి ఖన్నా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. టాలీవుడ్‌లో ఆమె నటించిన పెద్ద హీరోలలో ఎన్టీఆర్‌తో మాత్రమే స్క్రీన్ షేర్ చేసుకుంది. “జై లవకుశ” సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆమె కనిపించింది. కానీ ఈ సినిమా తర్వాత కూడా రాశికి పెద్దగా అవకాశాలు రాలేదు ఇటీవల రాశి ఖన్నా గురించి పెళ్లి రూమర్లు సోషల్ మీడియాలో విపరీతంగా పాకాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ, “నా పెళ్లి గురించి వదంతులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, కానీ అవి అసత్యం. నాకు భవిష్యత్తులో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని కోరిక ఉన్నా, ఇప్పుడది నా ప్రాధాన్యత కాదు. అది చాలా కాలం తర్వాత ఆలోచించదగ్గ విషయం. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు మీకే ముందుగా చెబుతాను. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించవద్దు, అవి నాకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి,” అని రాశి క్లారిటీ ఇచ్చింది.

రాశి ఖన్నాను కొన్నాళ్ల క్రితం మరో రూమర్ కూడా తంటాలు పెట్టింది. ఓ స్టార్ హీరోని ప్రేమించిందని ఆ హీరో తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ రూమర్లు ఆ సమయంలో రాశి ఖన్నాను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. “ఇలాంటివి చేయడం సరికాదు,” అంటూ ఆమెపై మండిపడ్డారు రాశి ఖన్నా తన సినీ ప్రస్థానంలో ఇన్ని అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె ఇప్పటికీ అవకాశాలను గమనిస్తూ ముందుకు సాగుతోంది. సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ నటి, విమర్శలకు బదులుగా తన పనితో నిరూపించుకోవాలని చూస్తోంది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Innovative pi network lösungen. Hest blå tunge. Join fox news for access to this content.