ప్లాస్టిక్ సర్జరీ ప్రచారం పై లేడి సూపర్ స్టార్ క్లారిటీ

తాను ఫేస్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జరుగుతున్న ప్రచారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

“లేడీ సూపర్ స్టార్” అనే టాగ్‌లైన్‌ తో యూత్ పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తున్న భామ నయనతార. రెండు దశాబ్దాలుగా దక్షిణ భారతీయ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటూ వస్తుంది. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన నయనతార..మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను అందుకుంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో డియర్ స్టూడెంట్ , తమిళంలో జయం రవితో కలిసి తని ఓరియన్ 2 తో పాటు మరో మూడు భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మధ్య సోషల్ మీడియాలో నయనతారకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే రూమర్స్ వైరల్ గా మారడం తో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. నా కనుబొమ్మలంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్లకి ముందు వాటి ఆకారాన్ని మారుస్తూ ఉంటాను.అందుకోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాను.కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా నా ముఖంలో మార్పు వస్తుంది.

బహుశా ఈ కారణంతోనే నా ముఖంలో మార్పులు వచ్చాయని అందరు అనుకుంటూ ఉంటారు. అంతే కానీ ప్లాస్టిక్ సర్జరీ అనేది నిజం కాదు.డైటింగ్ వలన కూడా నా ముఖంలో మార్పులు వచ్చి ఉండవచ్చు.ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్టు కనిపించి మరోసారి లోపలకి వెళ్లినట్టు కనిపిస్తాయి.కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడవచ్చు,నా బాడీ లో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదని చెప్పుకొచ్చింది. ఇక ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్న నయనతార, సరోగసి ద్వారా ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం టెస్ట్, మన్నన్​గట్టి సిన్స్​ 1960, డియర్ స్టూడెంట్స్, తని ఒరువన్ 2, మూకుథి అమ్మన్ 2 చిత్రాల్లో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *