అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణ మరోసారి మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శులు గుప్పించారు. తల్లి, చెల్లిపై కేసులు నమోదు చేయడంతో, జగన్ పాతాళంలో పడిపోయారని విమర్శించారు. ఆయనతో కలిసి ఉన్న వారందరూ కూడా పాతాళంలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. చివరకు, జగన తన స్వంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారని ఆరోపించారు.
ఇది ఆస్తుల వివాదం కాదు, ఇది రాజకీయ ఆత్మహత్య అని యనమల పేర్కొన్నారు. షర్మిలకు రూ.200 కోట్లిచ్చానని జగన చెబుతున్నా… ఐటీ, ఈడీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసలు ఈ రూ.200 కోట్ల సొమ్ము ఆయనకు ఎక్కడి నుంచి వచ్చినట్లు అడిగారు. ఈ సందర్భంలో, జగనపై యనమల ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.
ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఎలా ఉన్నాడో అని ప్రశ్నించారు. భవిష్యత్తులో జగన మళ్లీ అధికారంలోకి రాయడం అసాధ్యమని చురకలంటించారు. పాత కేసులకు తోడు కొత్త కేసులు కూడా ఆయనపై సిద్ధంగా ఉన్నాయని, ఇవాళ కాకపోతే రేపు జగన జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు.