బీజీంగ్: చైనాలో జనాభా పెరుగుదల, జననాల రేటు పడిపోవడం అనే రెండు పెద్ద సమస్యలు ఒకే సమయంలో సంభవిస్తున్నాయి. పుట్టిన బాలల సంఖ్య తగ్గుతున్నది కాబట్టి, దేశ వ్యాప్తంగా చాలా స్కూళ్లు మూతపడుతున్నాయని తాజా నివేదికలు తెలిపాయి.
గత ఏడాది చైనా దేశంలో 14,808 కిండర్ గార్టెన్లు మూసివేయబడ్డాయి. 2022 తో పోలిస్తే, విద్యార్థుల సంఖ్య 11% తగ్గిందని విద్యాశాఖ తెలిపింది. అలాగే, 2022 లో 5,645 ప్రాథమిక పాఠశాలలు కూడా మూతపడ్డాయి.
చైనాకు ప్రస్తుతం రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. జననాల రేటు దిగజారడం మరియు వృద్ధుల సంఖ్య పెరగడం. ఈ దేశంలో జనాభా గత రెండు సంవత్సరాలుగా తగ్గుతూ, తాజాగా 140 కోట్లకు చేరింది. 2023లో, జననాల సంఖ్య సుమారు 20 లక్షలు తగ్గిందని సమాచారం ఉంది. 1949 తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదుకావడం ఇదే మొదటిసారి.
మరోవైపు చైనాలో 2023 నాటికి 60 సంవత్సరాలకు పైబడ్డ వారి సంఖ్య 30 కోట్లకు చేరుకోగా, 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లు, 2025 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మూతపడ్డ కిండర్ గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.