వైఎస్‌ఆర్‌సీపీ-టీడీపీ మధ్య ఉద్రికత్తలు..మాజీ మంత్రి అప్పలరాజు గృహ నిర్బంధం

Tensions between YSRCP-TDP..Former minister Appalaraju under house arrest

అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ-పలాసలో వైస్‌ఆర్‌సీపీ మరియు టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బాలికపై తెలుగుయువత పాలస అధ్యక్షుడు ఢిల్లీ రావు దాడి చేశారని ఆరోపణలు రావడంతో, పోలీసులు టీడీపీ కార్యకర్తలపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో పలాసలో శనివారం రాత్రి నుంచే పరిస్థితులు ఉత్కంఠంగా మారాయి.

అయితే దాడులపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అప్పలరాజు నిన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో, అక్కడే ఉన్న కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించారు. ఇది పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేసింది. అయితే, నిందితులపై చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఆ తర్వాత, అప్పలరాజు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇకపోతే..పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేటీరోడ్డులో శనివారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీడీపీకి చెందిన కొర్ల విష్ణుపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త అల్లు రమణ దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. విష్ణు కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. ఈ సమయంలో రమణతో పాటు మాజీ మంత్రి అప్పలరాజు అనుచరుడు మన్మథరావుపై కూడా దాడి జరిగింది. దీనిపై కానిస్టేబుల్ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నలుగురితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు సీఐ మోహన్‌రావు తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త రమణ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *