naveen vijay krishna malli pelli social media naresh tollywood pavitra lokesh jpeg

ఎస్‌డీటీ-18 ; చిత్రానికి ఎడిటర్‌గా మారి పోయిన నవీన్‌ విజయకృష్ణ .

సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ తనయుడు నవీన్ విజయకృష్ణ, ఇంతకు ముందు హీరోగా పలు చిత్రాల్లో అదృష్టాన్ని పరీక్షించినప్పటికీ, ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త ప్రయోగం చేసి ఎడిటర్‌గా మారాడు. నవీన్‌ గతంలో పలు ట్రైలర్ కట్‌లు చేసి సినిమా రంగంలో మంచి పేరు సంపాదించాడు. ఇక ఇటీవల సాయి దుర్గ తేజ్‌ (సాయి ధరమ్‌ తేజ్) ప్రధాన పాత్రలో నటించిన “సత్య” అనే షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించి తన ప్రతిభను మరింతగా చాటుకున్నాడు “సత్య” షార్ట్ ఫిల్మ్ సైనికుల త్యాగాలను, దేశభక్తిని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. ఈ చిత్రం పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడి మంచి స్పందన పొందింది. ఈ సక్సెస్ తర్వాత, నవీన్ విజయకృష్ణ సాయిధరమ్ తేజ్ నటిస్తున్న భారీ చిత్రమైన “SDT -18″కు ఎడిటర్‌గా ఎంపికయ్యాడు. ఈ సినిమాకి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా, హనుమాన్ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి నవీన్ విజయకృష్ణ ఎడిటర్‌గా చేరడం, చిత్రబృందంలోకి కొత్త శక్తిని తెచ్చింది. ఈ విషయంపై హీరో సాయి దుర్గ తేజ్‌ తన ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. “నా సోదరుడు, నా స్నేహితుడు నవీన్ నా అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘SDT-18’ చిత్రానికి జాయిన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ పని చేసినా, నవీన్ నాకెప్పుడూ ఓ పిలుపు దూరంలోనే ఉంటాడని మరోసారి నిరూపించాడు” అని ఆయన తన భావాలను వెల్లడించారు ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నాయికగా లక్ష్మీ మీనన్ నటిస్తుండగా, సంగీతం అందించడం “కాంతార” ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు, పీరియాడిక్ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతున్నాయని అంచనా వేయబడుతోంది”SDT-18″ సినిమా, సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యంత కీలకంగా భావించబడుతున్న చిత్రం. నవీన్ విజయకృష్ణ తన ఎడిటింగ్ స్కిల్స్ తో ఈ చిత్రానికి కొత్త మకుటాన్ని జోడించబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ketua dpd pjs gorontalo diduga diancam pengusaha tambang ilegal. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news.