nikhil

“అనంతం” టీజర్‌ను విడుదల చేసిన హీరో నిఖిల్‌

వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “అనంతం” ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో రుచిత సాధినేని రామ్ కిషన్ స్నిగ్ధ నయని వసంతిక మచ్చ చైతన్య సగిరాజు వంటి ప్రముఖ నటులు భాగమయ్యారు ఈ చిత్రాన్ని ఆరుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ లక్ష్మి సుధీర్ నిర్మిస్తున్నారు “అనంతం” చిత్రానికి సాయిచరణ్ రెడ్డి రేకులతో కలిసి వెంకట్ శివకుమార్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు లవ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది.

ఈ క్రమంలో చిత్ర టీజర్ ను స్టార్ హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. టీజర్ చూసిన తర్వాత హీరో నిఖిల్, “అనంతం” టీజర్ ఎంతో ఆకట్టుకునేలా ఉందని సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ సందర్భంగా, ఆయన సినిమా యూనిట్ కు తన అభినందనలు తెలియజేసి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

నిర్మాతలు విజయలక్ష్మి మరియు సుధీర్ మాట్లాడుతూ “మా ‘అనంతం’ టీజర్ విడుదల చేసిన హీరో నిఖిల్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ మా సినిమాకు సమయం కేటాయించడం చాలా గొప్ప విషయం ‘అనంతం’ చిత్రాన్ని లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నమ్ముతున్నాం సినిమా పూర్తి అయ్యింది చాలా త్వరలోనే అనుకూలమైన తేదీ చూసి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది” అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Integration des pi network für weltweite zahlungen. : overvægtige heste kan udvikle fedt omkring manken, hvilket giver en hævet og blød fornemmelse. Uriha ridge faces child abuse charges and one count of felony murder.