pattabhi jagan

తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠా ఆ వ్యక్తులు – పట్టాభి

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జగన్-షర్మిల ఆస్తుల పంపకం వివాదంపై స్పందించారు. జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తుందని, తాడేపల్లి ఇంటికి విధేయంగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి వ్యక్తులు జగన్ ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారిందనే ఆరోపణలను పట్టాభిరామ్ ఖండించారు. 2019లో షర్మిల, జగన్ మధ్య ఒక ఎంవోయూ కుదిరిందని, ఆస్తుల పంపకం విషయమై ఉన్న ఒప్పందాన్ని జగన్ అనుసరించకుండా, తన పైన, తల్లిపైన కేసులు పెట్టారని షర్మిల ఆరోపణ చేస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు సమక్షంలో ఈ ఎంవోయూ జరిగిందా? జగన్-షర్మిల కుటుంబ వ్యవహారంలో చంద్రబాబుకు ఏ విధమైన సంబంధం ఉందా? అని ప్రశ్నిస్తూ, జగన్ కుటుంబ విషయాల్లో టీడీపీ నాయకుడు చంద్రబాబును అనవసరంగా లోనిచేయవద్దని హితవు పలికారు. జగన్ తన తల్లి, చెల్లిని కోర్టు సమస్యల్లోకి ఈడ్చడమే కాకుండా, దీన్ని “ఘర్ ఘర్ కీ కహానీ” అని సమర్థించారని పట్టాభి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Guаrdіоlа’ѕ futurе іn fresh dоubt wіth begiristain set tо lеаvе manchester city. Retirement from test cricket.