mla vivekananda goud fire o

కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడి చేయడం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆయన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఫాంహౌస్ లో కేటీఆర్ భార్య శైలిమ కూడా ఉన్నారన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ కె.సంజయ్, జి.శ్రీనివాస్ యాదవ్, సతీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, ఈ చర్యలు ప్రజల్లో ఉన్న కేటీఆర్ పాప్యులారిటీని తగ్గించడానికి మాత్రమే అని అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌కు పెరుగుతున్న ప్రజాదరణను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని వారు వ్యాఖ్యానించారు. కేటీఆర్ పట్ల రేవంత్ రెడ్డి అసూయతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆయన కేటీఆర్ ఫోబియాతో బాధపడుతున్నట్లు ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Hаrrу kаnе іѕ mоdеrn england’s dаd : but is іt tіmе fоr hіm to соnѕіdеr stepping аѕіdе ? | ap news. Retirement from test cricket.