ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ నవంబర్ 6న ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ప్రధానంగా, సీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై, రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ పై మంత్రులు చర్చించనున్నట్లు సమాచారం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే బడ్జెట్ కసరత్తులు ప్రారంభించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు ఆర్థిక శాఖ అధికారులతో పాటు, రాష్ట్ర అభివృద్ధి మరియు కొన్ని కంపెనీలకు సంబంధించిన ఆహ్వానాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ఈ భేటీ ద్వారా పలు నిర్ణయాలకు మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.