మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి బెదిరింపులు రావడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సాహితీ లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ తో జూబ్లీహిల్స్ లో ఇంటి లీజు వ్యవహారంలో ఏడాది క్రితం నుంచి తగాదాలు ఉన్నాయి. అయితే, జేసీ తన ఇంటిని స్వాతిక్ కు అద్దెకు ఇవ్వగా.. సాత్విక్ అదే ఇంటిని జేసీకి తెలియకుండా వేరొకరికి అద్దెకు ఇచ్చారు.
అద్దెకు తీసుకున్న వ్యక్తులు జేసీ ఇంటిని కూల్చివేసి వేరే నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ దివాకర్ రెడ్డి, అతని మేనేజర్ జగదీష్ లు వారిని ప్రశ్నించగా.. రాజీవ్ సాల్మన్ అనే వ్యక్తి, అతడి అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి, మేనేజర్ జగదీశ్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జేసీ దివాకర్ రెడ్డి (జూనే చింతమనేని దివాకర్ రెడ్డి) ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నేత. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన తెలుగుదేశం పార్టీ (TDP)కు చెందిన సీనియర్ నాయకుడిగా పలు పదవుల్లో కొనసాగారు. దివాకర్ రెడ్డి అనేక సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పని చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నో సార్లు విజయం సాధించి రాజకీయంగా స్థిరపడ్డారు.