మన జీవితం ప్లాస్టిక్ పర్యావరణంతో నిత్యం సంబంధం కలిగి ఉంది. ప్లాస్టిక్‌తో తయారైన వస్తువులు, ముఖ్యంగా ఆహార మరియు నీటిని నిల్వ చేయడానికి మనం విస్తృతంగా ఉపయోగిస్తాం. కానీ అన్ని ప్లాస్టిక్ రకాలూ ఆరోగ్యానికి మేలు చేయవు. కొన్ని రసాయనాలు హానికరంగా ఉండవచ్చు. ఈ రసాయనాలు ఆహారంలో కలిసిపోయి వివిధ వ్యాధులకు వాటిలో క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలకు దారితీస్తాయి.
ప్లాస్టిక్ వస్తువులపై కనిపించే ప్రత్యేక గుర్తింపులు వీటిలో ఉన్న ప్లాస్టిక్ రకాన్ని గుర్తించడానికి అవసరమైనవి. ఈ గుర్తింపులో మూడు బాణాలతో కూడిన త్రిభుజం ఉంటుంది. మరియు అందులోని నంబర్ ద్వారా ప్లాస్టిక్ రకాన్ని సూచిస్తారు:
- PETE (1): ఈ ప్లాస్టిక్ సాధారణంగా సురక్షితంగా ఉన్నా, ఒకసారి మాత్రమే ఉపయోగించడం మంచిది.
- HDPE (2): దీని వినియోగం దృఢంగా ఉండి కొంత వరకు భద్రమే కానీ, ఇది కొన్ని ఆహార పదార్థాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
- PVC (3): ఈ ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైనది. దీని నిర్మాణంలో ఉన్న రసాయనాలు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి.
- LDPE (4): ఇది కూడా పెద్దగా ప్రమాదకరమైనది కాదు. కానీ వేడికి గురైతే కొన్ని రసాయనాలు విడుదలవుతాయి.
- PP (5): ఈ ప్లాస్టిక్ ఎక్కువగా సురక్షితంగా పరిగణించబడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో హానికరమైన రసాయనాలు ఉండవచ్చు.
- PS (6): ఇది అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్. దీనిలో ఉన్న స్టైరీన్ రసాయనం ఆరోగ్యానికి హానికరంగా ఉంటది.
- Other (7): ఈ కేటగిరీలో ఉన్న ప్లాస్టిక్‌లలో పలు హానికరమైన రసాయనాలు ఉండవచ్చు, ప్రత్యేకంగా BPA.
ప్రతి తరహా ప్లాస్టిక్‌ను వాడేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. వేడితో సంబందించి ప్లాస్టిక్ లోని రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి వేడి ఆహారాలు లేదా తాగునీటిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్‌ను ఉపయోగించడం మంచిది కాదు. అందువల్ల ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన ప్లాస్టిక్ ఎంపిక చేస్తే, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.