11 2

మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్ని రామకృష్ణారెడ్డి

అమరావతి: మరోసారి వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన గతంలో విధించిన బెయిల్ షరతులను సడలించాలని, విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టును తిరిగి ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పిన్నెల్లి తరఫున న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ కుమారుడు సింగపూర్‌లో ఉన్నత విద్యను కొనసాగించడానికి వెళ్ళనున్నాడు కాబట్టి, తండ్రిగా పిన్నెల్లి కూడా ఆయనతో పాటు వెళ్లాల్సి ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. పాస్‌పోర్టు విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఇప్పటికే పోలీసుల తరఫున న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరగా, హైకోర్టు 28వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మునుపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల సందర్భంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన బెయిల్ పొందారు, ఈ నేపథ్యంలో బెయిల్ షరతుల సడలింపునకు పిటిషన్ దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. But іѕ іt juѕt an асt ?. Latest sport news.