మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని రేవా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఐదుగురు దుండుగులు ఒక మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వివాహిత దంపతులు పిక్నిక్ కోసం గుర్ ఇండస్ట్రియల్ ఏరియాలో వెళ్లారు. ఇద్దరూ మధ్య గొడవ పడగా, ఐదుగురు వ్యక్తులు మహిళను వేధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక లైంగిక దాడి చేసారు.
ఈ ఘటన ఫై హిమాలి పాఠక్, రేవా హెడ్‌క్వార్టర్స్ డీఎస్పీ మాట్లాడుతూ..ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. సుమారు వంద మంది అనుమానితులను గుర్తించామంటూ, కేసు సెన్సిటివ్ గా ఉన్నందున బాధితుల వివరాలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని వివరించారు. ఈ ఘటన అందరి మనస్సులో ఆందోళన కలిగించింది మరియు స్త్రీలపై జరిగే దాడులపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండగా, ఈ ఘటన మునుపటి కేసుల సరసన మరింత తీవ్రతను చూపిస్తోంది.