పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన అద్భుతమైన స్పిన్‌తో మ్యాచ్‌లో కీలకమైన ప్రదర్శనను కనబరుస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్రను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన సుందర్, అదే రీతిలో రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతడిని మరోసారి ఔట్ చేశాడు సుందర్ వదిలిన బంతి రచిన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సుందర్ వేసిన వేగవంతమైన లెంగ్త్ డెలివరీకి సమాధానం చెప్పలేక, రచిన్ రవీంద్ర కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించినా, బంతి అతడి బ్యాట్‌ను మిస్ చేసి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఈ అద్భుత బౌలింగ్ దెబ్బకు రవీంద్ర కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. రవీంద్ర ఆశ్చర్యంగా తిలకించే ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం భీకరమైన పట్టు చూపిస్తోంది. 35 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి, మొత్తం 250 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులకే ఆలౌట్ కావడం, కివీ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ టీమిండియా పతనంలో కీలకంగా 7 వికెట్లు తీయడం మ్యాచ్‌కు ప్రధాన మలుపు తిరిగింది ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ తన మ్యాజిక్ స్పిన్‌తో భారత బౌలింగ్ దళాన్ని ముందుకు నడిపిస్తున్నాడు, అయితే మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.