అక్షయ్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ కృష్ణ’. ఈ సినిమాను దినేష్ బాబు దర్శకత్వంలో రూపొందించగా, పీఎన్ బలరామ్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ‘చిరురపాయం చేసుకున్న దోషమేంటో దైవమా అనే పాట ఎంతో చక్కగా సాగుతూ, వినిపించే ప్రతిసారీ హృదయాలను హత్తుకుంటోంది. ఈ లిరికల్ వీడియోను ప్రముఖ నటుడు మోహన్‌లాల్ విడుదల చేశారు పాటను విడుదల చేసే సందర్భంలో మోహన్‌లాల్ మాట్లాడుతూ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట నా మనసును అమితంగా ఆకట్టుకుంది. ఈ పాట ఎంతగా హృదయాలను చేరుకుందిo అలా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత పీఎన్ బలరామ్ మాట్లాడుతూ, ఈ చిత్రం ఓ నిజ ఘటన ఆధారంగా రూపొందించబడింది. హృదయాలను మృదువుగా తాకే ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాము అని తెలిపారు చిరురపాయం పాటకు గిరిపట్ల లిరిక్స్ అందించగా, హరిప్రసాద్ సంగీతం సమకూర్చారు ఈ చిత్రం సున్నితమైన కథాంశంతో ప్రేక్షకులను సెంటిమెంట్‌లో ముంచెత్తుతుందని భావిస్తున్నారు. సినిమాలోని పాటలు, సంగీతం ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు, చిత్రానికి మరింత బలం చేకూరుస్తాయనే ఆశించాలి.