నంద్యాల జిల్లా గోపవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ రాజు, మహానంది ఆలయానికి తన అపార భక్తిని చాటుతూ దేవస్థానానికి భారీ విరాళం అందించారు. ఆయన 2 ఎకరాల 10 సెంట్ల భూమి, 5 సెంట్ల ఇంటిని దానం చేయడంతో మొత్తం విలువ రూ.2 కోట్లకు చేరింది.
ఇది మాత్రమే కాకుండా, రాజు గతంలో ఒక ఎకరం పొలాన్ని కూడా ఆలయానికి విరాళంగా ఇచ్చారు. ఇంకా వివాదంలో ఉన్న మరో ఎకరాన్ని కూడా వివాద పరిష్కారం అనంతరం దేవస్థానానికి అప్పగిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ ఔదార్యానికి సాక్ష్యంగా ఆలయ అధికారులు ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించి, ఈఓ శ్రీనివాస రెడ్డి ఘన సన్మానం చేశారు. ఈ భారీ విరాళం ఆలయ అభివృద్ధికి పునాది వేస్తుందని భక్తులు అభినందిస్తున్నారు.