బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు సాధారణంగా ఆహారంపై అనేక నియమాలను పాటిస్తారు. రాత్రి సమయంలో తేలికగా ఆహారం తీసుకోవడం ఈ నియమాల్లో ఒకటి. అయితే కొందరు ఉదయాన్నే తినే అల్పాహారాన్ని రాత్రి కూడా తీసుకుంటున్నారు. నిపుణులు చెబుతున్నట్టు కొన్ని అల్పాహారాలు రాత్రి భోజనానికి అనుకూలం కావు. కావున రాత్రి మెనూలో ఏవి చేర్చాలో పరిశీలిద్దాం.
ఉదయాన్నే తినే బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ – పోహా, ఇడ్లీ, ఉప్మా, ఆమ్లెట్, కిచిడీ వంటి పదార్థాలు రాత్రి కూడా తీసుకోవచ్చు. ఇవి ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆహారాలు రాత్రి తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.
పూరీ, వడ, పకోడీ, సమోసా వంటి నూనె పదార్థాలు దూరంగా ఉండాల్సిన ఆహారాలు. అలాగే బేకరీ ఐటమ్స్, ప్యాన్‌కేక్స్ వంటి పదార్థాలు రాత్రి తీసుకోకూడదు. ఇవి ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి.
తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు మంచి నిద్రకు సహాయపడుతుంది. 2018లో ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ’లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రాత్రి తేలికగా ఆహారం తీసుకోవడం గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది.
ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడితో బాగా నిమగ్నమైన వారు రాత్రి భోజనం తయారు చేసుకోడానికి సమయం కేటాయించడం కష్టం అవుతోంది. ఇలాంటి సందర్భాలలో ఇంట్లోనే సులభంగా తయారు చేసే ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌లు మంచి ఎంపిక. అయితే తిన్నది ఎక్కువగా కాకుండా, ఆలస్యంగా తినడం అనేది నివారించాలి. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత రెండు గంటల తరువాతనిద్ర పోవడం మంచిది..