అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, లేఖ రాశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కారణంగా 10 మంది మరణించగా, వందల మంది బాధితులయ్యారని చెప్పారు. నీటి మరియు భూగర్భ జలాల కలుషితంతో డయేరియా వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు, పల్నాడు జిల్లా దాచేపల్లి అంజనాపురం కాలనీలో కూడా డయేరియాతో సంబంధిత వాంతులు, విరోచనలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం చంద్రబాబు కలెక్టర్‌తో మాట్లాడి, ఈ మృతులు నీరు కలుషితమై చనిపోయరా లేదా ఇతర కారణాల వల్లనే మృతి చెందారని పరిశీలించారు.
దాచేపల్లిలోని పరిస్థితులపై చర్చించిన అనంతరం, అధికారులు బోర్ల నీటిని ల్యాబ్‌కు పంపించాలని సూచించారు. బోర్లను మూసివేసి, నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రాంతంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పరిస్థితి సాధారణమయ్యేవరకు పర్యవేక్షణ చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు… ఈ మేరకు కె. రామకృష్ణ సీఎం చంద్రబాబకు బహిరంగ లేఖ రాశారు.