ఏపీపీఎస్సీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా అనురాధ బాధ్య‌త‌ల‌ స్వీక‌రణ‌

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో ఈ బాధ్యతలు చేపట్టారు. అనురాధ బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నియామకాలను సమీక్షించేందుకు బోర్డు సభ్యులు మరియు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రూప్-1, గ్రూప్-2తో పాటు నిర్వహించాల్సిన పలు నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలపై కూడా ఆమె ఆరా తీశారు.

గత వైసీపీ ప్రభుత్వం గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించినప్పుడు, ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత ఈ పదవి ఖాళీగా ఉండగా, అనురాధను కొత్తగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనురాధ గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ మరియు హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరించిన అనుభవం ఉన్న ఆమెకు ఈ బాధ్యతలు చేపట్టడం ప్రజల మధ్య ఆశలు పెంచుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

分钟前. Discover the secret email system…. Elevate your explorations with the 2025 forest river blackthorn 3101rlok : luxury meets adventure !.