Anushka : సడెన్‌గా ఇలా షాకి చ్చావేంటి అనుష్క

anushka shetty first malayalam movie kathanar 99372987

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఆమె సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సూపర్ స్టార్ నాగార్జునతో కలిసి నటించిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు అరంగేట్రం చేసింది ఆరంభంలో అనుష్క గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైంది అయితే దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి సినిమాలో అనుష్క తన నటనతో ప్రేక్షకులను మెప్పించి, స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సాధించుకుంది. ఆ చిత్రం ఆమెకు జేజమ్మ అనే పేరు తెచ్చిపెట్టింది అప్పటి నుంచి అనుష్కను ప్రేక్షకులు ఆ పేరు పిలుస్తున్నారు.

ఇటీవలి కాలంలో అనుష్క సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటోంది చాలా సెలెక్టివ్‌గా ప్రాజెక్టులను ఎంచుకుంటోంది బాహుబలి తర్వాత ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ గతంలో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం మంచి విజయాన్ని సాధించింది ఆ సినిమా తర్వాత ఆమె మరే సినిమాను అంగీకరించలేదు అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క మలయాళ చిత్రసీమలో తన తొలి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం పేరు కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ ఇది హారర్ ఫాంటసీ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతోంది, ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం దీనికి దర్శకత్వం వహిస్తున్నది రోజిన్ థామస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అనుష్క అభిమానులకు ఎంతో ఆసక్తికరంగా మారింది.

ఇదే సమయంలో అనుష్క వ్యక్తిగత జీవితంపై పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి కొంత మంది ఆమె పెళ్లి చేసేసుకుందని అనుకుంటున్నారు అనుష్క ప్రభాస్ లేదా ఓ పారిశ్రామికవేత్తతో పెళ్లి అనేదీ గతంలో పుకార్లుగా వినిపించింది కానీ ఆమె ఈ పుకార్లపై స్పందించకుండా తన సినీ కెరీర్‌లో మరిన్ని సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇంకా క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే మరో భారీ పాన్ ఇండియా చిత్రం కూడా అనుష్క పూర్తి చేసిందని సమాచారం ఈ రెండు చిత్రాలు కథనార్ మరియు ఘాటి త్వరలోనే విడుదల కానున్నాయి అనుష్క అభిమానులు ఈ వార్తలతో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆమె నుంచి ఇలాంటి సినిమాలకు సంబంధించిన వార్తలు రావడం ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తింది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Belgian police shut down a far right conference as it rallies ahead of europe’s june elections. Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its.