భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు అశ్విన్ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు పూణేలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రెండు కీలక వికెట్లు పడగొట్టి ఈ ఘనతను సాధించాడు ఈ ఫీట్‌లో ముఖ్యంగా న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను అవుట్ చేయడం కీలకం అయింది ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 74 ఇన్నింగ్స్‌లలో 188 వికెట్లు ఉన్నాయి ఈ రికార్డుతో అతను ఆసీస్ బౌలర్ నాథన్ లియోన్ (187 వికెట్లు)ను అధిగమించి ముందుకువచ్చాడు. ఈ జాబితాలో ప్యాట్ కమిన్స్ (175 వికెట్లు), మిచెల్ స్టార్క్ (147 వికెట్లు), స్టువర్ట్ బ్రాడ్ (134 వికెట్లు) తదితరులు ఉన్నారు.
అశ్విన్ 188 వికెట్లు సాధించడంలో విశేషం ఏమిటంటే లియోన్ కంటే 2,500 బంతులు తక్కువగా బౌలింగ్ చేస్తూ ఈ రికార్డును నెలకొల్పాడు లియోన్ 78 ఇన్నింగ్స్‌లలో 26.70 సగటుతో 187 వికెట్లు తీయగా అశ్విన్ 20.75 సగటుతో 74 ఇన్నింగ్స్‌లలోనే 188 వికెట్లు సాధించడం అతని ప్రతిభకు నిదర్శనం
అశ్విన్ 11 సార్లు ఐదు వికెట్లు తీయడం కూడా అతని కాస్టింగ్‌ను మరింత ప్రత్యేకం చేస్తుంది. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ అగ్రగామిగా నిలవడం భారత జట్టు ఖ్యాతిని మరింత పెంచింది.
- రవిచంద్రన్ అశ్విన్ (భారతదేశం) – 188 వికెట్లు
- నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా) – 187 వికెట్లు
- ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 175 వికెట్లు
- మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 147 వికెట్లు
- స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) – 134 వికెట్లు
అశ్విన్ మరిన్ని విజయాలు సాధించేందుకు ఈ కొత్త రికార్డు ప్రేరణగా నిలవనుంది.