Governor Jishnu Dev Varma will visit Suryapet today

నేడు సూర్యాపేటలో పర్యటించనున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడురోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం సూర్యాపేట జిల్లాలో సందర్శనకు వెళ్లనున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశానికి ఆయన హాజరవుతారు.

ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేటకు చేరుకుంటారు. ఉదయం 10:30 గంటకు సూర్యాపేట కలెక్టరేట్‌కు చేరి అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, 11:30 గంటలకు జిల్లా అధికారులతో కలిసి వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమయంలో, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు సమాచారం అందిస్తారు.

తర్వాత, జిల్లా వివిధ రంగాల్లోని రచయితలు, కవులు, కళాకారులు, అవార్డు గ్రహీతలతో గవర్నర్ సమావేశమవుతారు. సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడే భోజనం చేసి, అనంతరం భద్రాచలం వైపు పయనమవుతారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు.

కాగా, ఇందులో భాగంగా, జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ సమీక్షిస్తారని అంచనా వేస్తున్నారు. ఇది స్థానిక అభివృద్ధికి కొత్త ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Lankan t20 league.