హైదరాబాద్‌లోని వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ అధికారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ కారణంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ.. ఈ ఆంక్షలు అక్టోబర్ 28 వరకు అమలులో ఉంటాయన్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మూసివేత కారణంగా, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్ వైపు ప్రయాణించే వాహనాలు బిచ్చారెడ్డి స్వీట్స్ ద్వారా మళ్లిస్తారు. అలాగే, ఐఐఐటీ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు వెళ్లే వాహనాలు కూడా గచ్చిబౌలి జంక్షన్ పక్కనుండి వెళ్తాయి. వాహనదారులు తమ ప్రయాణాలకు ముందుగా ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని సురక్షితంగా ప్రయాణం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.