తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుఫాన్ వాయువ్య దిశగా కదులుతూ, రేపు తెల్లవారుజామున వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని,అంతకు ముందు అక్టోబర్ 24 అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 25 తెల్లవారుజాము మధ్య ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.
తుఫాన్ ప్రభావంతో సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండవచ్చని, ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అలాగే, రేపు రాత్రి వరకు 80-100 కిమీ వేగంతో, ఆ తర్వాత 100-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.