రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు ప్రముఖ నటుడు దర్శన్‌కు సంబంధించిన తాజా పరిణామం చర్చనీయాంశమైంది దర్శన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జైలు అధికారులకు అతడి ఆరోగ్య నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది బెయిల్ కోసం దర్శన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి విచారించారు దర్శన్ పిటిషన్‌పై అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ వాటిని సమర్పించాలని కోర్టు సూచించింది ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్న దర్శన్ వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారని వైద్యులు అతడికి శస్త్రచికిత్స అవసరమని పేర్కొనడంతో బెయిల్ ఇవ్వాలని దర్శన్ తరఫున న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.
కేసు విచారణలో అనేక లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి పోలీసులు సాక్ష్యాలను సృష్టించారంటూ వివిధ ఆరోపణలు చేస్తున్నారని న్యాయవాదులు తెలిపారు దీంతో న్యాయమూర్తి దర్శన్ ఆరోగ్య నివేదిక సమర్పించేందుకు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసి కేసు విచారణను వాయిదా వేశారు దర్శన్ పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టై జైలులో ఉన్నారు వారి జైలు జీవితం ఇప్పటికే 100 రోజులు దాటింది ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత బెయిలు వస్తుందని ఆశించగా ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు దర్శన్ భార్య విజయలక్ష్మి ఇతర సన్నిహితులు ప్రముఖ లాయర్లను నియమించి అతడికి బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంతవరకు ఫలితం లేకపోయింది ఈ క్రమంలో దర్శన్ బళ్లారి జైలులో పవిత్ర బెంగళూరు సెంట్రల్ జైల్లో ఇంకొన్ని రోజులు గడపాల్సి ఉంటుంది పరిస్థితులు మార్చుకుంటే వారిద్దరూ మరోసారి బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేశారు దాంతో కోర్టు తదుపరి చర్య కోసం ఎదురు చూస్తున్నారు.