టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌ల అనుభవం ఉన్నప్పటికీ జట్టులో తన స్థానాన్ని చాలా కాలంగా కోల్పోయాడు అతను చివరిసారిగా 2023 జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడాడు ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో అవకాశాలు దక్కలేదు అయినప్పటికీ పుజారా దేశవాళీ మరియు కౌంటీ క్రికెట్‌లో మాత్రం తన ప్రతిభను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు ఇటీవలి రంజీ ట్రోఫీ పోటీలో డబుల్ సెంచరీ సాధించాడు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి 18వ అర్ధ సెంచరీగా నిలిచింది
ఈ సమయంలో నవంబర్ నెలలో ప్రారంభమవుతున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి పుజారాను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చలు జరుగుతున్నాయి 36 ఏళ్ల పుజారాకు ఆస్ట్రేలియా పర్యటనల్లో గొప్ప అనుభవం ఉంది 2018-19 సిరీస్‌లో అతను 1,258 బంతులు ఆడి 521 పరుగులు సాధించాడు తద్వారా సిరీస్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు మూడేళ్ల తరువాత జరిగిన సిరీస్‌లో కూడా 928 బంతులు ఆడి 271 పరుగులు సాధించి భారత బ్యాటింగ్ లైనప్‌కు బలమైన వెన్నెముకగా నిలిచాడు ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్ జాస్ హేజిల్‌వుడ్ మిచెల్ స్టార్క్ వంటి గంభీర బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే గుణం పుజారాకుంది. ఆసక్తికరంగా ప్రస్తుతం ఇరు జట్లలో అత్యధిక టెస్ట్ బంతులను ఎదుర్కొన్న ఆటగాడు పుజారానే కావడం విశేషం ఇది పుజారాను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి ఒక కారణంగా పేర్కొనవచ్చు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని అతడికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టును అక్టోబర్ 28న ప్రకటించే అవకాశం ఉంది పుజారా వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడికి ఆ జట్టులో చోటు కల్పిస్తారా లేదా అనేది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.