బ్రిక్స్ సదస్సు ..నేడు ప్రధాని మోడీ, షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం

PM Modi Speaks On The India Century At NDTV World Summit

న్యూఢిల్లీ : కజాన్ నగరంలో బ్రిక్స్ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ప్రధాని మోడీ , చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్తో సహా పలువురు నేతలు కజాన్ నగరానికి చేరుకున్నారు.

2020లో గాల్వాన్‌లో భారత్, చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అయితే, ఇప్పుడు రెండు దేశాల మధ్య చర్చలు మళ్లీ పట్టాలెక్కాయి.

రష్యాలో ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్ల మధ్య జరగనున్న సమావేశం గురించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సమాచారం ఇచ్చారు. బుధవారం బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం ఉంటుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.

తూర్పు లడఖ్‌లో కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్ – చైనా మిలిటరీ సంధానకర్తలు ముందుగా ఒక ఒప్పందానికి వచ్చారు. ఎల్‌ఏసీపై పెట్రోలింగ్‌కు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం తెలియజేశారు.

భారతదేశం- చైనా నుండి సంధానకర్తలు గత కొన్ని వారాలుగా ఈ సమస్యపై టచ్‌లో ఉన్నారు. ఇటీవలి ఒప్పందం ఇరు దేశాల మధ్య విబేధానికి దారితీస్తోందని, 2020లో ఈ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలను అంతిమంగా పరిష్కరిస్తామని విక్రమ్ మిస్రీ చెప్పారు.

కాగా రష్యాలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, ప్రధాని మోదీ పశ్చిమాసియాలో పెరుగుతున్న సంఘర్షణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల రక్షణ కోసం భారతదేశం పిలుపును పునరుద్ఘాటించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు, దౌత్యం అవసరమని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Missing sebastian rogers : police say ‘inaccurate’ info has caused ‘distraction’ – mjm news. Latest sport news.