jagapathibabu

Jagapathi Babu: ఎంత ఎదవలాగా చేస్తే అన్ని అవార్డులు.. జగపతిబాబు సంచలనం

నటుడు జగపతి బాబు ఇటీవల చేసిన ఓ ట్వీట్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఆయన చేసిన వ్యాఖ్యలు వాటికి సంబంధించిన వివరణ వదంతులు చర్చనీయాంశమయ్యాయి జగపతి బాబు మొదట ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు అయితే రెండవ ఇన్నింగ్స్‌లో విలన్‌గా మళ్లీ పుట్టుకువచ్చారు ఆయన పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలను తెలుగు మాత్రమే కాకుండా తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రాల్లోనూ చేస్తున్నాడు. తన విలక్షణ నటనతో అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఈ క్రమంలో ఆయన నటనకు గుర్తింపుగా కొద్దిరోజుల క్రితం దుబాయ్‌లో జరిగిన ఐఫా 2024 అవార్డుల కార్యక్రమంలో కన్నడ బెస్ట్ విలన్ అవార్డును అందుకున్నారు.

ఈ అవార్డును ఆయన కన్నడ చిత్రమైన కాటేరా లో దారుణమైన విలన్ పాత్రకు గాను అందుకున్నారు ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర చాలా విభిన్నంగా ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉండటంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది అయితే ఈ అవార్డును అందుకున్న సమయంలో ఆయన చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి అవార్డు అందుకున్న వీడియోను షేర్ చేస్తూ ఎంత ఎదవలా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు ఆ కామెంట్‌ వెనుక ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని కొందరు ఆసక్తిగా చర్చిస్తున్నారు కొంతమంది అవార్డుల మీద ఆయనకు సరైన అభిప్రాయం లేదని అనుకుంటే మరికొందరు అవార్డుల మీద అభిప్రాయం లేకపోతే దుబాయ్ వరకు వెళ్లారా అని ప్రశ్నిస్తున్నారు జగపతి బాబు వ్యాఖ్యలు హాస్యంగా చేసినా అవార్డుల మీద ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని తెలియజేసేలా కనిపిస్తున్నాయి.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Ketua dpd pjs gorontalo diduga diancam pengusaha tambang ilegal. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Lanka premier league.