క్రీయాశీలకంగా పార్టీలో పనిచేస్తే చంపేస్తారా ?..జీవన్‌ రెడ్డి

Will they kill me if I work actively in the party?.. Jeevan Reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి అనుచరుడు మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై జీవన్ రెడ్డి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. గంగారెడ్డిని దారుణంగా హత్య చేయడంతో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.గంగారెడ్డి హత్యను నిరసిస్తూ తన అనుచరులతో కలిసి జగిత్యాల-ధర్మపురి రహదారిపై జీవన్‌ రెడ్డి ఆందోళనకు దిగారు.ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘మాకు నలుగురికి సేవ చేయడమే తెలుసు.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని అయినా ప్రజలకు సేవ చేస్తా. ఇక మీకు.. మీ పార్టీకి ఓ దండం. ఇకనైనా మమ్మల్ని బతకనివ్వండి. ఇంతకాలం అవమానాలకు గురైనా తట్టుకున్నాం.. మానసికంగా అవమానాలకు గురవుతున్నా భరించాం.. కానీ ఇవాళ భౌతికంగా లేకుండా చేస్తే ఎందుకు.’అని కాంగ్రెస్ పార్టీని జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు.తన అనుచరుడిని హత్య చేయడం అంటే తనను కూడా హత్య చేసినట్లే అని ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీయాశీలకంగా పార్టీలో పనిచేస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు. దీంతో జీవన్‌ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జీవన్‌ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మహేష్ కుమార్ గౌడ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్‌ రెడ్డి మధ్యలోనే ఫోన్ కట్ చేశారు.

గంగారెడ్డిని చంపిన వారిని పట్టుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. ఇక రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై జీవన్‌ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జీవన్ రెడ్డికి సముచిత స్థానమే దక్కింది. అయితే ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తనకు ఎటువంటి సమాచారం లేకుండా తన రాజకీయ ప్రత్యర్థిని పార్టీ చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకనొక సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచన కూడా చేశారు. ఇప్పుడు తన అనుచరుడనే హత్య చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??. Follow the instructions, generate your sales machine funnel in 1 click…. Open road rv.