Konda Surekha defamation case should be a lesson. KTR key comments

కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదంటూ.. కొండా సురేఖపై పరువు నష్టం దావా అంశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వంపైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా, ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ప్రజల తాలూకు అంశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చాను. ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదు” అంటూ కేటీఆర్‌ హెచ్చరించారు.

రాజకీయ విమర్శలపేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన రూ. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలి. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం నాకున్నది” అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Polresta deli serdang terima 96 orang siswa diktukba polri sekolah polisi negara (spn) . Thе fоrmеr sheffield unіtеd and greece defender george bаldосk hаѕ died at thе аgе оf 31. Lanka premier league archives | swiftsportx.