Chandrababu: ఇసుక విధానంపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ఇసుక విధానంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం జరిగిన సమీక్షలో, ఉచిత ఇసుక విధానం సరైన రీతిలో అమలు జరగాలని, ఇసుకను పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇసుక సులభంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సీనరేజ్ విధానాన్ని రద్దు చేసినట్టు సీఎం తెలిపారు.

తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు చెందిన ప్రధాన నగరాలు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు ఏపీ నుంచి ఇసుక అక్రమంగా తరలింపులు జరుగుతున్నాయని గుర్తించిన సీఎం, ఈ మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.

ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు స్వీకరించే సరికొత్త ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం, గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాల కోసం ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు, లోడింగ్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులపై బాధ్యతగా అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

决?. Discover the secret email system…. 2023 forest river rockwood freedom 2318g.