బద్వేల్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటర్ విద్యార్థిని పై విఘ్నేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి అంటించగా..బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
విఘ్నేశ్, బాధితురాలితో కొంతకాలంగా పరిచయం కలిగి ఉన్నాడని, కానీ ఇటీవల జరిగిన తగాదాల కారణంగా ఈ ఘటన చోటు చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు విఘ్నేశ్ని వెంటనే అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరిచారు, అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. విఘ్నేశ్ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా ప్రజల నుంచి గట్టిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాని సైతం నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, ప్రజలు కోరుతున్నారు.