prince

Prince: నాకు పబ్లిసిటీ చేసుకోవడం చేతకాదు: హీరో ప్రిన్స్

యువ నటుడు ప్రిన్స్, సినీ ఇండస్ట్రీలో తన ప్రయాణం గురించి ఇటీవల ‘సుమన్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నాడు 19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రిన్స్ 21 సంవత్సరాలకే హీరోగా తన ప్రయాణం ప్రారంభించాడు అయితే సరైన మార్గదర్శకం లేక కెరీర్ ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు ఇండస్ట్రీలోకి చాలా చిన్న వయసులో వచ్చినప్పటికీ అనుభవం కొరవడటం వల్ల కొంత ఇబ్బంది పడ్డాను నాకు సరైన గైడెన్స్ లభించలేదు దీంతో కొన్ని తప్పులు కూడా చేశాను అని పూసగుచ్చినట్లు చెప్పాడు ప్రిన్స్ తన సహనటులు నవీన్ చంద్ర సుధీర్ బాబు సందీప్ కిషన్ వంటి నటులతో కలసి సుమారు ఒకే సమయంలో సినీ ప్రస్థానం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసాడు మేము ఒకే సమయంలో ప్రయాణం మొదలుపెట్టినా ప్ర‌తీ ఒక్కరూ తమ దారిలో ముందుకు సాగారు అని అన్నారు.

ప్రిన్స్ మాట్లాడుతూ ఫెయిల్యూర్స్ గురించి తన ఆలోచనలను కూడా పంచుకున్నాడు అసలు ప్రతి ఒక్కరికీ ఫెయిల్యూర్స్ వస్తాయి వాటిని స్మరించుకుంటూ బాధపడితే ఆ బాధనే మనకు ఆటంకం మొదట్లో నేను కూడా కొన్ని విషయాలను మరిచిపోవడానికి కొంత సమయం తీసుకున్నాను ప్రేమలోని విఫలతలు వ్యక్తిగత సమస్యలు చాలా చోటు చేసుకున్నాయి కానీ ఇప్పుడు వాటిని తలుచుకునే సమయం లేదు జీవితంలో ముందుకు సాగడమే నా లక్ష్యం అని స్పష్టం చేశాడు ఇతర హీరోలతో సంబంధాలు గురించి కూడా ప్రిన్స్ క్లారిటీ ఇచ్చాడు “నాకు ఒక రకమైన విమర్శ ఉంది – నేను పెద్ద హీరోలతో కలసి కనబడనని వాళ్లతో స్నేహం చేయనని కానీ అది పూర్తిగా తప్పు నేను వారందరినీ కలుస్తాను వారితో మాట్లాడతాను ఆ సంధర్బాలను ఆనందిస్తాను కానీ వెంటనే వారితో ఫోటో దిగిపోయి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడం నాకు అలవాటు లేదు అలాగే అలాంటి ప్రచారం నాకు ఇష్టం కూడా కాదు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అలాగే తన అభిమాన హీరో గురించి ప్రస్తావిస్తూ నాకు మహేశ్ బాబుగారు అంటే చాలా ఇష్టం ఆయన యొక్క నటన వ్యక్తిత్వం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి ఇక దర్శకుల్లో రాజమౌళిగారి దర్శకత్వంలో నటించడం నా జీవితంలో ఒక పెద్ద కల ఆ కలను నిజం చేసుకోవడానికి ఎంత కష్టమైనా పడతాను అని తెలిపాడు ప్రిన్స్ తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు ఎదగాలని మంచి పాత్రలు ఎంచుకుని ప్రేక్షకుల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Com – gaza news. Latest sport news.