Naredco Telangana has announced the 14th Naredco Telangana Property Show 2024

14వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో 2024’’నుప్రకటించిన నారెడ్కో తెలంగాణ

మూడు రోజుల ప్రాపర్టీ షో 2024 అక్టోబర్ 25న హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రారంభం..

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన “నారెడ్కో తెలంగాణా ప్రాపర్టీ షో”ని నారెడ్కో తెలంగాణ ప్రకటించింది. నారెడ్కో తెలంగాణా ప్రాపర్టీ షో 14వ ఎడిషన్, 2024 అక్టోబర్ 25 నుండి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమవుతుంది. విభిన్న కొనుగోలుదారుల అవసరాలను తీర్చడానికి నివాస, ఆఫీస్ కమర్షియల్, రిటైల్ కమర్షియల్ తో సహా వివిధ రకాల ప్రాపర్టీలను ప్రదర్శిస్తుంది. భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న వాటిలో హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకటి. తెలం గాణ ప్రభుత్వ నూతన సంస్కరణలు, కొనసాగిస్తున్న ప్రయత్నాల ద్వారా ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, ఏవియే షన్, ఆటోమొబైల్స్, ఇతర కీలక రంగాలతో సహా అన్ని రంగాలలో నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత కొన్ని త్రైమాసికాలుగా హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగం ఈ ప్రాంతం లోని ఆస్తులకు బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది, ఇది గృహ అవసరాలను తీర్చడంలో మా నిబద్ధతకు నిద ర్శనం. కార్పోరేట్ ల్యాండ్‌స్కేప్‌లో హైదరాబాద్ ఉజ్వలంగా ప్రకాశిస్తూనే ఉంది. బహుళజాతి కంపెనీలకు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అగ్ర ఎంపికగా మారింది. నారెడ్కో తెలంగాణ ద్వారా నిర్వహించబడుతున్న ప్రాపర్టీ షోలో డెవలపర్లు, బిల్డర్లు, ప్రమోటర్లు ఉంటారు. కొనుగోలుదారులు, విక్రేతలు పరస్పరం పరస్పరం సంభాషించుకునేందుకు, విస్తృత ప్రాపర్టీల ఎంపికలను అన్వేషించడానికి ఇది వన్-స్టాప్ గమ్యస్థానం. రాబోయే నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో డెవలపర్లు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్లు, ఆర్థిక సంస్థలతో కూడిన వందకు పైగా సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులు, సాంకేతి కతలను ప్రదర్శించనున్నాయి.

నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీ విజయ సాయి మేకా మాట్లాడుతూ, “హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ల్యాండ్‌ స్కేప్‌ను మార్చడంలో నారెడ్కో తెలంగాణ నాయకత్వం వహించడం గర్వంగా ఉంది. ఇది వినియోగదారు లకు, సమాజానికి సేవ చేయడంలో మా అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. గత దశాబ్ది కాలంగా నగర రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా రెండంకెల వృద్ధిని అందిస్తోంది. ఈ విషయంలో ఇతర ప్రధాన నగరాలను అధిగమించింది. పటిష్ఠ మౌలిక సదుపాయాలతో పాటుగా తెలంగాణ ప్రభుత్వ దార్శనిక విధానాలు ఇందుకు కారణం. ఈ పురోగతి మార్గంలో కొనసాగుతున్న సందర్భంలో మా వ్యూహాత్మక దృష్టి అంతా కూడా వి మా వినియోగదారుల అభివృద్ధి చెందు తున్న అవసరాలు, ఆకాంక్షలను తీర్చే వినూత్న, సుస్థిరదాయక పరి ష్కారాలను అందించడంపైనే ఉంది. అది రియల్ ఎస్టేట్ వృద్ధి, అభివృద్ధికి హైదరాబాద్ అగ్ర గమ్యస్థానంగా ఉండేలా చూస్తుంది” అని అన్నారు. హైడ్రా ఏర్పాటును, హైదరాబాద్‌లోని సరస్సులను, ప్రభుత్వ భూములను పరిరక్షించాలనే ఆ సంస్థ లక్ష్యాలను నారెడ్కో తెలంగాణ హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం పరిరక్షిస్తుందని మరియు కొనుగోలు నిర్ణయాలు తీసుకోవాలనుకునే వారు లేదా ఇప్పటికే ఆ నిర్ణయాలు తీసుకున్న వారు ఎలాంటి ఆందోళనలు లేకుండా కొనుగోలు చేయవచ్చు అంటూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సకాలంలో చేసిన ప్రకటనను కూడా మేం స్వాగతిస్తున్నాం. ఆమోదం పొందిన కొన్ని ప్రాజెక్టులు కూడా అక్రమంగా నిర్మించారనే తప్పుడు సమాచారం దృష్ట్యా ఈ వివరణ ఇవ్వాలని మేం ప్రభుత్వాన్ని అభ్యర్థించాం. కొనుగోలుదారులలో వ్యాపించిన సందేహాలు, ఆందోళనలను తొలగించడానికి ఈ ప్రకటన తోడ్పడుతుంది.
మూసీ రివర్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఆర్‌ఆర్‌ఆర్ ఏర్పాటు, కొత్త మెట్రో రూట్లు, నాల్గవ నగరం అభివృద్ధి వంటి ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రణాళికలు రాబోయే సంవత్సరాల్లో తెలంగాణలో రియల్ ఎస్టేట్ వృద్ధికి తోడ్పడనున్నాయి. ఎంతగానో అవసరమైన ఈ అన్ని మౌలిక ప్రాజెక్టులకు నారెడ్కో తెలంగాణ సానుకూలంగా మద్దతు ఇస్తుంది మరియు ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వంతో కలసి చురుకుగా పని చేస్తుంది.
నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీ K శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘నారెడ్కో తెలంగాణా ప్రాపర్టీ షో 14వ ఎడిషన్ విభిన్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా విభిన్న ప్రాపర్టీలను ప్రదర్శిస్తుంది. మనం పండుగల సీజన్ దిశగా వెళ్లుతున్ సందర్భంలో ప్రతి కాబోయే కొనుగోలుదారు తమకు నచ్చిన ఆస్తిని పరి గణన లోకి తీసుకోవడానికి, ప్లాన్ చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. ఇది వారికి స్వల్పకాలికంగా మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని అన్నారు.

14వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకి స్పాన్సర్లు:

ప్లాటినం స్పాన్సర్లు – వాసవి గ్రూప్ మరియు అన్విత గ్రూప్
పవర్డ్ బై – రామ్కీ ఎస్టేట్స్
గోల్డ్ స్పాన్సర్లు – వెర్టెక్స్ హోమ్స్ మరియు కాన్సెప్ట్ యాంబియెన్స్
సిల్వర్ స్పాన్సర్స్ – అపర్ణ గ్రూప్ మరియు రాధే కన్స్ట్రక్షన్స్
బ్రాంజ్ స్పాన్సర్లు – సైబర్‌సిటీ బిల్డర్లు & డెవలపర్లు; విజన్ ఇన్ఫ్రా మరియు జైన్ కన్స్ట్రక్షన్స్
ఫామ్ వర్క్ పార్టనర్ – i-ఫామ్ అల్యూమినియం డిజైన్ LLP
పోర్టల్ భాగస్వామి – 99acres.com

రియల్ ఎస్టేట్ కంపెనీలు వివిధ రకాల కస్టమర్లకు సరిపోయే అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు, ప్లాట్‌లు వంటి విభి న్న ప్రాపర్టీలను ప్రదర్శిస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసిహెచ్‌ఎఫ్‌ఎల్) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రసిద్ధ ఆర్థిక సంస్థలు తమ గృహ రుణ ఉత్పత్తులను అందించనున్నాయి. సరఫరాదారులు వారి ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తారు.

నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో 2024..

తేదీలు : 25, 26, 27 అక్టోబర్ 2024 (ప్రవేశం ఉచితం)
సందర్శన వేళలు : ఉదయం10:00 గంటలు – రాత్రి 8:00 గంటలు
వేదిక: హాల్ నెం. 4, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్

నారెడ్కో తెలంగాణ గురించి..

నారెడ్కో తెలంగాణ అనేది 29 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ. రియల్ ఎస్టేట్ డెవలపర్ల ప్రయత్నాలకు ప్రాతిని థ్యం వహించేందుకు, సమన్వయం చేసేందుకు ఏర్పాటైంది. వృద్ధిని కొనసాగించేందుకు వీలుగా రియల్ ఎస్టేట్ స్నేహపూర్వక విధానాలు, సేవల డెలివరీ సిస్టమ్ అమలు లాంటి అంశాలపై విధాన నిర్ణేతలతో సమన్వయం చేసుకునేందుకు గాను నారెడ్కో తెలంగాణ అనేది పరిశ్రమ తరఫున ప్రభుత్వంతో కలసి పని చేస్తోంది. నారెడ్కో తెలంగాణ రియల్టీ పరిశ్రమలో ప్రముఖులతో సహా 300కు పైగా సభ్యులను కలిగిఉంది. విధానాల రూపకల్పన, నూతన సాంకేతికతలకు ప్రోత్సాహం, ప్రాథమిక డిమాండ్ కు ఉన్నతి కలిగించడం వంటి వాటి ద్వారా రియల్ ఎస్టేట్ రంగ వృద్ధిని ప్రోత్సహించడం నారెడ్కో తెలంగాణ ఆశయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Swiftsportx | to help you to predict better.