NZ 3

T20 Womens World Cup 2024: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 విజేత న్యూజిలాండ్

2024 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేతగా న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు తనదైన ముద్ర వేసింది దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్టును 32 పరుగుల తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను గెలుచుకుంది ఈ విజయంతో న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో మరో అద్భుత అధ్యాయం లిఖించబడింది ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు 20 ఓవర్లలో 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది సుజీ బేట్స్ (32) అమేలియా కేర్ (43) బ్రూకీ హాలిడే (38)లు న్యూజిలాండ్ స్కోరుబోర్డును నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు అమేలియా కేర్ బ్యాటింగ్‌లో తన అద్భుత ప్రదర్శనతో పాటు బౌలింగ్‌లోనూ మెరిసి ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టుకు కఠిన పరీక్షను పెట్టింది దక్షిణాఫ్రికా బౌలర్లలో మాబా 2 వికెట్లు తీయగా ఖాకా ట్రైయోన్ నదినే చెరో వికెట్ తీసి ప్రత్యర్థి జట్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

159 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్టు తడబడింది కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ 33 పరుగులు చేసినప్పటికీ మిగతా ఆటగాళ్లు కివీస్ బౌలర్ల దాటికి నిలువలేకపోయారు దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 126 పరుగులు మాత్రమే చేయగలగడంతో న్యూజిలాండ్ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది న్యూజిలాండ్ బౌలర్లలో రోజ్మేరీ మెయిర్ అమేలియా కేర్ చెరో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును తీవ్రంగా దెబ్బతీశారు ఫ్రాన్ జోనాస్ బ్రూకీ హాలిడే కూడా తలో వికెట్ తీసి తమ పాత్రను అద్భుతంగా పోషించారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన అమేలియా కేర్ బ్యాటింగ్ బౌలింగ్ రెండింట్లోనూ అదరగొట్టి తన నైపుణ్యాన్ని మరింతగా చాటుకుంది అమేలియాకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కడం న్యూజిలాండ్ విజయానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చింది.

ఇదిలా ఉండగా టోర్నమెంట్ ప్రారంభం ముందు న్యూజిలాండ్ జట్టు ఈ స్థాయిలో రాణిస్తుందని ఎవరూ ఊహించలేదు ఎందుకంటే కప్‌కు ముందు జట్టులో అనేక ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం వరుస పరాజయాలు మూటగట్టుకోవడం లాంటి సమస్యలు వేధించాయి 2022 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం వరకు న్యూజిలాండ్ కేవలం 3 విజయాలను మాత్రమే అందుకుంది కానీ ఈ మెగా టోర్నీకి వచ్చి తమ ఫామ్‌ను పూర్తిగా తిప్పికొట్టారు ప్రారంభ మ్యాచ్‌లోనే భారత ఉమెన్స్ జట్టును ఓడించి తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు వారి క్రమపద్ధతిలో ఆడిన ఆటతీరును ఆత్మవిశ్వాసాన్ని చూస్తే వారు కప్‌ను గెలవడం అనివార్యమని చెప్పవచ్చు ఈ విజయంతో న్యూజిలాండ్ మహిళల క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ప్రారంభమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Lanka premier league archives | swiftsportx.