హీరో శ్రీ విష్ణు ఇటీవల సామజవరగమన మరియు ఓం భీం వంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు ఇప్పుడు ఆయన మరో వినూత్నమైన కథతో స్వాగ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమాకు దర్శకుడిగా గతంలో రాజ రాజా చోర వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన హసిత్ గోలినే మళ్ళీ దర్శకత్వం వహించాడు ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన రీతూ వర్మ మీరా జాస్మిన్ దక్ష నగార్కర్ శరణ్య హీరోయిన్లుగా నటించారు చిత్రంలోని శ్రీ విష్ణు గెటప్స్ పోస్టర్లు టీజర్లు ట్రైలర్లు ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచాయి ఫలితంగా సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ సృష్టించుకుంది.
స్వాగ్ ఒక సున్నితమైన అంశమైన జెండర్ ఈక్వాలిటీ (సమానత్వం)కి కామెడీని జోడించి వినోదాత్మకంగా రూపొందించిన సినిమా ఈ చిత్రంలో సమాజంలో ఉండే ఆడ మరియు మగ అనే భేదాలను క్రమంగా చూపిస్తూ అందరూ సమానమే అనే సందేశాన్ని హాస్యభరితంగా చెప్పే ప్రయత్నం జరిగింది ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం అక్టోబర్ 4 న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది విడుదల సమయంలో ఎన్టీఆర్ దేవర సినిమాతో పోటీ పడుతూ కూడా స్వాగ్ మంచి వసూళ్లు రాబట్టింది కానీ సినిమాలో పాత్రలు ఎక్కువగా ఉండటంతో కొంతమంది ప్రేక్షకులు కథలో కొంత గందరగోళానికి గురయ్యారన్న నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి అయినప్పటికీ ఐదు పాత్రల్లో శ్రీ విష్ణు నటనకు ప్రేక్షకులు పూర్తిగా మంత్రముగ్ధులయ్యారు ఆయా పాత్రల్లో అతని నట విశ్వరూపం సినీ ప్రేమికులను ఫిదా చేసింది
స్వాగ్ థియేటర్లలో విజయవంతమైన తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత నవంబర్ 4 న స్వాగ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావొచ్చని వార్తలు వస్తున్నాయి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం స్వాగ్ మూవీని థియేటర్లలో మిస్ అయ్యారా అయితే కొద్ది రోజులు వేచి ఉండండి నవంబర్ మొదటి వారంలో ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ఇళ్లల్లోనే చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవ్వండి!