సినిమాల్లో బ్రేక్ రావాలని ఎంతో మంది కళాకారులు కష్టపడుతుంటారు, అయితే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. కొంత మంది నటులు, ఫేమ్ వచ్చిన తర్వాత ఒకటిని విడిచి మరొకటి అన్నట్లు, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని, తమ కెరీర్‌ని పుంజుకుంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే మనస్తత్వం ఉండటం సహజం కానీ కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రం అవకాశాలను వడపోసి కేవలం తమకు నచ్చిన కథలు తమకు అనువైన పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ తమని తాము పరిపూర్ణంగా చూసుకుంటారు
చైతూ జొన్నలగడ్డ తన నటనా శైలి వెబ్ సిరీస్‌లు సినిమాల్లో కనిపించిన విశిష్టమైన పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెబ్ సిరీస్‌లలో బబుల్‌గమ్ భామాకలాపం వంటి ప్రాజెక్టుల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు తన ప్రతిభతో మెప్పించిన చైతూ ఇప్పుడు తనలోని మరింత సృజనాత్మకతను ప్రజలకు పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాడు చైతూ జొన్నలగడ్డ కేవలం నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన టాలెంట్‌ని చాటేందుకు సిద్ధమవుతున్నాడు MM2 అనే ప్రాజెక్ట్ ద్వారా తన రచనా ప్రతిభతో పాటు నటనా కౌశలాన్ని కూడా ఆవిష్కరించబోతున్నాడు ఇందులో చైతూ రైటర్ యాక్టర్‌గా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఇతర ప్రాజెక్టులు కూడా చైతూ లైన్‌లో పెట్టుకున్నాడు.
తన వద్దకు వచ్చే ప్రతి పాత్రను జాగ్రత్తగా పరిశీలించి తనకు నచ్చిన సరైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ చైతూ తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు ఈ క్రమంలో ఇప్పటికే మూడు ప్రధాన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తనలోని మల్టీటాలెంట్‌ను మరింతగా చూపించేందుకు చైతూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో MM2 అనే ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయబోతున్నాడు ఈ ప్రాజెక్ట్‌లో చైతూ రైటర్‌గా నటుడిగా తన టాలెంట్ చూపించబోతున్నాడు ఈ ప్రాజెక్ట్ చైతూకి మరో మైలురాయి కావడం ఖాయం ఈ విధంగా తన కెరీర్‌లో మెచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ క్వాలిటీ కంటెంట్‌పై దృష్టి పెట్టిన చైతూ తన మల్టీటాలెంట్ దారిలో మరింత ముందుకు సాగుతూ ప్రేక్షకుల మనసును గెలవడం ఖాయమని అంచనా.