India Vs New Zealand: అంపైర్లతో వాగ్వివాదానికి దిగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కారణం ఇదే

India Vs New Zealand

బెంగళూరులో భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ చివరి రోజున అత్యంత ఉత్కంఠగా మారింది ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు గెలవడానికి చివరి రోజున 107 పరుగులు అవసరం కాగా భారత్ గెలవాలంటే 107 పరుగుల లోపే న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‌ను ఆలౌట్ చేయాల్సి ఉంది నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ ముగియడంత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి న్యూజిలాండ్ బ్యాటింగ్ మొదలుపెట్టింది అయితే వెలుతురు తగ్గిపోవడంతో అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేశారు ఇది భారత్ జట్టు అసంతృప్తికి కారణమైంది ఆటను ముందుగా నిలిపివేయడం పట్ల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు ఇద్దరూ కలిసి అంపైర్లతో వాగ్వాదానికి దిగారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ఫ్లడ్‌లైట్ల వెలుతురు ఉన్నప్పటికీ వాతావరణం మేఘావృతంగా ఉండడం వర్షం పడే అవకాశం ఉండటం కారణంగా అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది అప్పటికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 బంతులే వేసారు భారత బౌలర్లు కొత్త బంతితో బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆట నిలిపివేయడంతో వారిలో తీవ్ర నిరాశ చోటుచేసుకుంది భారత జట్టు ప్రధానంగా తమ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ద్వారా వికెట్లు తీసే అవకాశం ఉందని ఆశించింది 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రక్షించడానికి కనీసం రెండు మూడు వికెట్లు పడగొట్టాలని భారత బౌలర్లు భావించారు అయితే అంపైర్లు బుమ్రాను బౌలింగ్ ఆపి ఆటను నిలిపివేయడంతో భారత ఆటగాళ్లు నిరాశకు లోనయ్యారు ఆటను ముందుగానే ముగించడంతో న్యూజిలాండ్ ఓపెనర్లు డెవోన్ కాన్వే టామ్ లాథమ్ సంతోషంగా మైదానం విడిచి వెళ్లారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    精选. Forever…with the new secret traffic code. Used 2021 grand design momentum 399th for sale in arlington wa 98223 at arlington wa cy176a open road rv.