పిల్లల హృదయాలను గెలుచుకునే క్యారెట్,బాదం బర్ఫీ

క్యారెట్, బాదం బర్ఫీ చాల సులభంగా తాయారు చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లలు చాల ఇష్టంగా తింటారు. కారెట్ తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ క్యాలొరీస్ కలిగిన కారెట్, బరువు నియంత్రణకు అనుకూలంగా ఉంటుంది. బాదం కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగివుంది. బాదంలో మగ్నీషియం మరియు కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.

క్యారెట్, బాదం బర్ఫీ ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం

కావాల్సిన పదార్ధాలు:
బాదం పప్పు – 1 కప్పు
పంచదార – 2 కప్పులు
వెన్న – అర కప్పు
క్యారెట్ – 2
యాలకుల పొడి – అర టీ స్పూను
తయారు చేయు విధానం

దీన్ని తయారు చేయాలంటే ముందుగా బాదం పప్పును రాత్రి మొత్తం నానబెట్టాలి. తర్వాత దాని పొట్టుతీసేసి విడిగా ఉంచుకోవాలి. మరోపక్క క్యారెట్ ను కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత బాదం, క్యారెట్ ముక్కలను కలిపి, పాలతో మిక్సీకి పట్టి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో బాదం మిశ్రమం , పంచదార, వెన్న వేసి ఉడికించాలి.

ఇలాచి పొడి చల్లి ప్లేట్ కి నెయ్యి రాసి క్యారెట్ బర్ఫీ ని వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. అంతే రుచికరమైన క్యారెట్ బాదం బర్ఫీ సిద్ధంగా ఉంటుంది.
దీనిని పండగలప్పుడే కాకుండా మామూలు సమయంలో కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

书艺术?. 7 figure sales machine built us million dollar businesses. New 2025 forest river sanibel 3902mbwb for sale in monroe wa 98272 at monroe wa sn152.