ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభావంతమైన నటులలో ఒకరైన అజయ్ ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేసే నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు ముఖ్యంగా విలన్ పాత్రల్లో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటుడు ఇతర రకాల పాత్రలలోనూ తన సత్తా చాటుతున్నాడు ఇటీవల ఆయన నటిస్తున్న తాజా చిత్రం పొట్టేల్ తో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు ఇది ఒక రూరల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రానికి సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహిస్తున్నారు నిశాంక్ రెడ్డి కుడితి మరియు సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రం అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది అజయ్ మాట్లాడుతూ సాహిత్ కథ చెప్పగానే మొదట నేను కేవలం క్యాజువల్‌గా విన్నాను కానీ రెండు గంటల నేరేషన్ తర్వాత నా పాత్ర నన్ను విశేషంగా ఆకట్టుకుంది నాకు ఈ పాత్ర చేయాలనిపించింది ఎందుకంటే ఈ పాత్ర లేకపోతే సినిమా పాడైపోతుందనే ఫీలింగ్‌ను దర్శకుడు సృష్టించాడు అని పేర్కొన్నారు సాహిత్ కథ చెప్పిన విధానం ఎంత అద్భుతమో సినిమాను కూడా అంత అద్భుతంగా తీర్చిదిద్దారని అజయ్ తెలిపారు.
ఇది మల్టీ లేయర్ కథగా ఉంటుందని ఇది ఒక చిన్న పాపను విద్య కోసం ఫైట్ చేసే కథతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని చెప్పారు అజయ్ ఈ చిత్రంలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని ప్రేక్షకులను విభిన్న సన్నివేశాలతో అలరిస్తుందని అన్నారు ప్రేక్షకులు కొన్ని సీన్లలో విజిల్స్ వేస్తారని ఆయన ఉద్గాటించారుకథే నన్ను ప్రధానంగా ఆకట్టుకుంది ఆ తర్వాత నా పాత్ర నాకు బాగా నచ్చింది అద్భుతంగా రూపొందించిన క్యారెక్టర్స్ లో యువ అనన్య పాత్రలూ చాలా గొప్పగా కుదిరాయి అని అజయ్ వివరించారు అజయ్ ప్రకారం విక్రమార్కుడు సినిమాలోని టిట్ల పాత్ర తరువాత అటువంటి స్థాయిలో పాత్రలు తగ్గాయని అయితే పటేల్ పాత్రలో అనేక షేడ్స్ ఉండటం కారణంగా ఈ పాత్ర చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు యాక్టర్ గా నా కెరీర్‌లో ఇలాంటి రోల్ చాలా రోజుల తర్వాత దొరికింది ఇది నిజంగా నాకు హ్యాపీనెస్ ఇచ్చిన పాత్ర అని అన్నారు నాకు ఎమోషనల్ రోల్స్ చేయడం అంటే చాలా ఇష్టం నేను ఆ పాత్రలను బలంగా చేయగలనని నమ్ముతున్నాను అని అజయ్ చెప్పారు అజయ్ ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తున్నాడు అలాగే సింగం సినిమాలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించగా ఒక రీమేక్ సినిమా కొన్ని తమిళ మలయాళ ప్రాజెక్ట్స్ లో కూడా పని చేస్తున్నట్లు తెలిపారు.