shambala

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా ‘శంబాల’

తెలుగు చలనచిత్రం ప్రపంచంలో కొత్త సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఆది సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శంబాల ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్నారు కాగా యుగంధర్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాజశేఖర్‌ అన్నభీమోజు మరియు మహిధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు శంబాల ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందనుంది ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది టైటిల్ పోస్టర్‌లో ఒక గ్రామం పిడుగులు కురుస్తున్న భీకర ఆకాశం మబ్బుల్లో కనిపిస్తున్న రాక్షస ముఖం వంటి అంశాలు ఈ చిత్రంలో థ్రిల్లర్ మరియు హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయని సూచిస్తున్నాయి.

ఈ చిత్రం ప్రత్యేకమైన జానర్‌లో రూపొందిస్తున్నామని భారతీయ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని ఒక కొత్త కథను అందించబోతున్నామని నిర్మాతలు తెలిపారు ఇది సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గొప్ప అంశాలు ఉంటాయి మేఘాల మధ్య జరిగే ఈ భయంకరమైన కథలో సరికొత్త అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాము అని వారు పేర్కొన్నారు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న శ్రీరామ్ మద్దూరి గతంలో డ్యూన్ ఇన్‌సెప్షన్ బ్యాట్ మ్యాన్ డన్ కిర్క్ వంటి ప్రముఖ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసిన హాలీవుడ్ లెజెండరీ కంపోజర్స్‌తో కలిసి పని చేసిన అనుభవం ఉంది ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ విషయంలో కూడా కొత్త మరియు ప్రత్యేకమైన సౌండింగ్‌ను అందించడానికి కృషి చేస్తున్నాము అని వారు చెప్పారు శంబాల ప్రేక్షకులను ఆకర్షించేలా రూపొందించబడుతోంది ప్రత్యేక కథ ఉన్నతమైన సాంకేతికత కొత్త సంగీతాన్ని అందించే ఈ చిత్రం తెలుగు చలనచిత్రం రంగంలో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నారు ఆది సాయికుమార్‌ నటన మరియు సినిమా కొత్త దిశలో పయనిస్తుందని నమ్మకంగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. Hаrrу kаnе іѕ mоdеrn england’s dаd : but is іt tіmе fоr hіm to соnѕіdеr stepping аѕіdе ? | ap news. Latest sport news.