జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ ఈ చిత్రాన్ని గరుడ వేగ అంజి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో ఆయనతో పాటు అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు రాకింగ్ రాకేష్ ఈ చిత్రాన్ని తన సొంత సంస్థపై నిర్మించారు శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు సాయి రాజేష్ అనసూయ విడుదల చేశారు ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఈ సినిమాని మూడు ఫిలిం ఫెస్టివల్ లలో ప్రదర్శించాలని నా కోరిక అందుకు మీ అందరి మద్దతు కావాలి అనసూయ గారు నన్ను జీరో దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఆమె నన్ను ఒక అమ్మలా చూసారు. వారు ఈ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది డైరెక్టర్ అంజి ఈ సినిమాని చాలా ఫ్యాషన్ తో తీశారు ఆయన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నన్ను ఒక బిడ్డ లాగా అన్ని నేర్పించారు చరణ్ అర్జున్ అందించిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది నా సక్సెస్‌లో నా భార్య సుజాత ఎంతో మద్దతు అందించారు మా సినిమాలో పని చేసిన ఆర్టిస్టులు టెక్నిషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
డైరెక్టర్ అంజి మాట్లాడుతూ రాకేష్ చాలా అద్భుతమైన కథను రాశారు కథ విన్న వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పాను సినిమాటోగ్రఫీ డైరెక్షన్ రెండూ నేనే చేశాను ఈ అద్భుత కథ తీసుకువచ్చిన రాకేష్ కి థాంక్యూ అన్నారు సాయి రాజేష్ మాట్లాడుతూ హృదయ కాలేయం ఆడియో ఫంక్షన్ కి రాకేష్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్కిట్ చేసి వెళ్ళాడు ఆ కృతజ్ఞత నాకు ఉండిపోయింది కొన్ని రోజులుగా ముంబైలో ఉన్నప్పటికీ రాకేష్ కోసం ఈ ఈవెంట్ కి వచ్చాను ఈ వేదికపై రాకేష్ కి థాంక్స్ చెప్తున్నాను నేను అతనికి కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్ రాస్తానని మాట ఇచ్చాను అని తెలిపారు ఈ సినిమా పట్ల అందరి ఆశలు మరియు అభిప్రాయాలు అందుతున్నాయి ప్రత్యేకించి రాకింగ్ రాకేష్ నటనపై అందరికీ ఆసక్తి ఉందని తెలిపారు.